1 . అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
2 . కిట కిట తలుపులు, కిటారి తలుపులు
ఎప్పుడు మూసిన చప్పుడు కావు
3 . అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది
వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు
4 . చారల పాము, చక్కటి పాము
నూతిలో పాము, నున్ననైనా పాము
5 . నాదశ్వరానికి లొంగని త్రాచు,
నిప్పంటించగానే ఆడెత్స్తుంది
6 . తొడిమ లేని పండు, ఆకు లేని పంట
7 . తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు
కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు
పాకి పోవు చుండు, పాము కాదు
8 . సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద
అందరూ ఇష్టంగా ఆరగిస్తారు
9 . అడుగులున్నా కాళ్ళు లేనిది
10 . అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే
సమాధానాలు
1 . కవ్వం
2 . కంటి రెప్పలు
3 . మురళి
4 . పోట్లకాయ
5 . చిచ్చుబుడ్డి
6 . విభూది పండు
7 . రైలు
8 . అరటిపండు
9 . గజం బద్ద
10 . నక్షత్రాలు
0 Comments